VSP: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా విశాఖ ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుడుమూరి గోవింద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ దాడి వెనుక వైసీపీ నాయకుడు గోవిందయ్య ఉన్నారని, దీని వెనుక జగన్ హస్తం ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కారణమైన వారిని శిక్షించాలని అన్నారు.