HYD నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి బయల్దేరే చర్లపల్లి–డెహ్రాడూన్ (07077/07078) ప్రత్యేక రైలు టెర్మినల్‌ను మార్చింది. ఇకపై ఈ రైలు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరనుంది. దీంతో నగరానికి దూరంగా ఉన్న చర్లపల్లి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.