HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పోలీసుల ప్రత్యేక దౌరవంలో మెట్రో స్టేషన్ సమీపంలో అనుమానాస్పద వ్యక్తిని సోదా చేయగా, అతని వద్ద రూ.9 లక్షల నగదు దొరికింది. సరైన పత్రాలు అందించకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసి సీజ్ చేశారు. తర్వాత ఈ కేసును రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకి తరలించారు.