భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 343 మ్యాచ్‌లు ఆడిన హర్మన్, NZ ప్లేయర్ సుజీ బేట్స్ (350) తర్వాత స్థానంలో నిలిచింది.