KKD: ఉప్పాడ తీర ప్రాంతంలో రక్షణ గోడను కచ్చితంగా నిర్మించి తీరుతామని, అందుకు తాను హామీ ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందుకు అయ్యే రూ.323 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరా. ఈ నెల 14న దీనిపై ఢిల్లీలో మూడోసారి భేటీ జరగనుంది. నిధుల విడుదలపై సాధకబాధకాలు అన్నీ నేను భరిస్తా. రింగ్ వలల వాడకంపైనా నిర్ణయం తీసుకుంటాం అని ఆయన తెలిపారు.