AP: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను పొందుపరిచింది. FBOలో మొత్తం 13,845 మంది మెయిన్స్ పరీక్షకు సెలెక్ట్ కాగా, FSOలో 2,346 మంది ఎంపికయ్యారు.