ATP: యాడికి మండలం బోయరెడ్డి పల్లి గ్రామంలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి గ్రామ సభ నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.