అన్నమయ్య జిల్లా ఆకేపాడు ఎస్టేట్లో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ కమిటీలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతంలో భాగస్వామ్యం కావాలని, క్షేత్రస్థాయి కమిటీలను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.