NGKL: మాతా శిశు మరణాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వైద్యాధికారి ప్రసన్న అన్నారు. గురువారం బిజినేపల్లి మండలం లట్టుపల్లి PHCలో గర్భిణీలకు మాతృత్వ సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. నమోదు చేసుకున్న ప్రతి గర్భిణీ మహిళలకు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మాతృత్వ సంరక్షణ సేవలు తప్పనిసరిగా అందించాలని సూచించారు.