ADB: మావల మండలంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈయన బజార్హత్నూర్ మండలంలోని వర్తమానూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.