అన్నమయ్య: రాజంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ దళిత నేతలు గురువారం ఆగ్రహ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ఆర్ఎస్ రోడ్డు నుంచి ఆర్ అండ్ బి బంగ్లా సమీపంలోని విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో, వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు.