సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి మందులు, పరికరాలు, ఆరోగ్య భీమాపై జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గినట్లు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓంకార్ మండల కన్వీనర్ వెంకటేశ్, మధు బాబు, రవీంద్ర, రత్నమ్మ, ప్రభాకర్ రాజు పాల్గొన్నారు.