NLG: మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించిన దేవరకొండ మండలం ధర్మతండాకు చెందిన మూడవత్ శిరీష, మూడవత్ మేఘన లను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గురువారం అభినందించారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యలో రాణించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.