TG: జనాభా ప్రకారం తమకు వాటా దక్కాల్సిందేనని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తామన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై భయపడాల్సిన పనిలేదన్నారు. బీసీలను కొంతమంది కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.