KDP: తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన నరేశ్ (40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం వేకువజామున మల్లేల గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. మృతుడు నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నరేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.