CTR: విజయపురం మండలం మల్లారెడ్డి కండ్రిగకు చెందిన తెలుగుదేశం నాయకులు నాదముని అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారి ఇంటికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం విషయాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.