కృష్ణా: దివిసీమ ప్రగతి ప్రదాత ఎంవీ కృష్ణారావు అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ అన్నారు. అవనిగడ్డలో వంతెన సెంటరులో కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా అయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.