కన్నడ బిగ్‌బాస్‌ను కాలుష్య నియంత్రణ మండలి సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించగా.. తాజాగా బిగ్‌బాస్ మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆ షో హోస్ట్ కిచ్చా సుదీప్ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.