AP: వైద్యశాఖలో 20 నెలల్లో 9,200 నియామకాలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. క్యాన్సర్కు తొలిసారి APలో స్క్రీనింగ్ చేశామని చెప్పారు. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో PPP మోడల్లో 10 మెడికల్ కాలేజీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్నాయని పేర్కొన్నారు.