రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో రెజ్లర్లు(Wrestlers) నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెజ్లర్లకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) మద్దతు ప్రకటించారు. రెజ్లర్లు ఒలింపిక్స్ లో దేశానికి ఖ్యాతిని తెచ్చారని, ఆ రోజు సంబరాలు చేసుకుని ఈ రోజు న్యాయం కోసం పోరాడుతున్న వారికి అందరూ అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేటీఆర్ చేసిన ట్వీట్:
We celebrated when these Olympic champions brought Glory to our Nation. Now let’s stand with them and express our solidarity as they fight for justice
The serious sexual harassment allegations against the chief of wrestling federation should be probed impartially and justice… pic.twitter.com/bzCp4qEx3D
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపై విచారణ జరిపించాలన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ అయిన బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని, లక్నోలోని నేషనల్ క్యాంపులో పలువురు కోచ్ లు మహిళా రెజ్లర్ల(Wrestlers)ను వేధించారని వినేశ్ ఫోగాట్ తో పాటుగా మరో ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేశారు.
బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఢిల్లీ పోలీసుల(Delhi Police)కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ వివాదం మాత్రం సద్దుమణగలేదు. కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. 30 మంది రెజ్లర్లు(Wrestlers) జంతర్ మంత్ వద్ద ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోవడంతో రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. తాజాగా వారికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్(KTR) మద్దతు తెలిపారు.