కడప: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్ఐ రంగా రావు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళల భద్రత, పోక్సో చట్టం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.