జవాన్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ (Hyderabad)లో విషాదం అలుముకుంది. తెల్లవారుజాము తుపాకీ కాల్పులతో (Gun Fire) హైదరాబాద్ నిద్రలేచింది. తన సర్వీస్ రివాలర్వ్ (Revolver)తో కాల్చుకుని ఓ సీఆర్పీఎఫ్ (CRPF) కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని బేగంపేటలో (Begumpet) చోటుచేసుకుంది. కాగా ప్రేమ వ్యవహారం కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
చత్తీస్ గడ్ (Chhattisgarh) రాష్ట్రానికి చెందిన దేవేందర్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (Constable)గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ బేగంపేటలోని చీకోటి గార్డెన్ వద్ద సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force – CRPF) ఐజీ మహేశ్ చంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తో దేవేందర్ పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల శబ్ధం రావడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బేగంపేట పోలీసులు వచ్చి పరిశీలించగా దేవంద్ర కుమార్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జవాన్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.