SRPT: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ సర్పంచ్ లాజర్ అన్నారు. శుక్రవారం గ్రామంలోని నర్సరీని ఆయన పరిశీలించి మొక్కల పెంపకంపై, సంరక్షకులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంటి పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులు మొక్కలు నాటాలని ఆయన కోరారు.