AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఎమ్మెల్యే భద్రత విషయంలో వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలిపారు. ‘తిరువూరు ప్రశాంతమైన నియోజకవర్గం. కొలికపూడి మా గౌరవ ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు ఏ దాడులు జరగవు. ఒకవేళ దాడులు జరిగి ఉంటే దోషులను అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’ అని చిన్ని పేర్కొన్నారు.