CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉపయోగించిన ఫర్నిచర్, ఎలక్ట్రికల్, స్పోర్ట్స్, కిచెన్ పరికరాలకు ఈనెల 23న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రశాంత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఏ సెక్షన్ సూపరింటెండెంట్ పుష్పరాజ్‌ను సంప్రదించాలని సూచించారు.