NTR: ఏ. కొండూరు మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) నుంచి వైద్య సహాయం అందింది. పెద్ద తండాకు చెందిన లోకేష్‌కు రూ. 1.77 లక్షలు, ఉపేంద్రకు రూ. 2.13 లక్షలు, అలాగే చీమలపాడుకు చెందిన బండి శ్రీలక్ష్మికి రూ. 6 లక్షల విలువైన ఎల్డీసీ (LOC) పత్రాలను ఎంపీ అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.