ADB: ఇచ్చోడ మండలంలోని ధర్మపురి గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈ నెల 25న నిర్వహించనున్న అఖండ హరినామ సప్తః కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు. గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.