trailer launch : రాణిగారి గదిలో దెయ్యం మూవీ ట్రైలర్ ఆవిష్కరణ
రోషన్, సాక్షి, స్రవంతి, పూజా డే కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘రాణిగారి గదిలో దెయ్యం (Ranigari gadi lo deyyam) అబిద్ దర్శకత్వంలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
రాణి గారి గదిలో దెయ్యం పేరుతో ఓ మూవీ రూపుదిద్దుకుంటోంది. రోషన్ (Roshan), సాక్షి, స్రవంతి, పూజా డే ఇందులో కీలక పాత్రలను పోషించారు. అబిద్ దర్శకత్వం(Directed by Abid)లో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి. వి. సత్యనారాయణ దీన్ని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’(Ranigari gadi lo deyyam) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.రాజుగారి గది’ సీరిస్ తో తెలుగులో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రముఖ యాంకర్ ఓంకార్ (Anchor Omkar) ఈ చిత్రాలను హారర్ నేపథ్యంలో తెరకెక్కించారు.
ఇటీవల హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ప్రోడ్యూసర్ మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్(Prasanna Kumar), ఆర్.కె. గౌడ్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “హారర్ కంటెంట్ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అని ఆయన వెల్లడించారు. నిర్మాత పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ “మా బ్యానర్ నుండి వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్ కాన్సెప్ట్(Horror concept)తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు అబిద్ మాట్లాడుతూ “నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్ కథతో చక్కని సినిమా తీశాం. షేర్ చక్కని సంగీతం అందించారు