ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత్ టాస్ ఓడింది. అటు టాస్ నెగ్గిన కంగారూల కెప్టెన్ ఆలీసా హేలీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆమెకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే చివరి మ్యాచ్. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్‌లు కోల్పోయిన హర్మన్ సేన.. ఇందులోనైనా విజయం సాధించాలని భావిస్తోంది.