ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన పదేపదే మోడీని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సినిమాల్లో బిజీగా ఉన్నా, తాజా రాజకీయాలపై తన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి మోడీ (PM MODI) పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.‘విగ్రహాల నిర్మాణం, ప్రత్యేక విమానాల కొనుగోలు(Purchase of aircraft), ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, విపక్ష ప్రభుత్వాలను కూలగొట్టడం కోసం రిసార్ట్ ఖర్చులు, ఫోటోగ్రఫీ(Photography), క్యాస్టూమ్, మేకప్, ఎన్నికల ప్రచారం.. ఇలా చాలా వాటికి ఖర్చు పెడుతూ మోడీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం పరచడం లేదు’’ అంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.ట్యాక్స్ పేయర్లు (Tax payers) కష్టపడి ప్రభుత్వానికి కడుతున్న డబ్బును దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.