ప్రమాదాల్లో గాయపడినప్పుడో, పలు సమస్యలతోనో శరీరంలోని నరాలు దెబ్బతింటుంటాయి. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారం కనుగొన్నారు. నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్‌ను అభివృద్ధి చేశారు. దెబ్బతిన్న నరాలను మళ్లీ పెరిగేలా చేసి, కోల్పోయిన సెన్సేషన్‌ను పూర్తిగా తిరిగి తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు అంటున్నారు.