SRPT: ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత చింత బాబు మాదిగ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. వర్గీకరణ అమలు, రూ.12 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 30న హైదరాబాద్‌లో చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని కోరారు.