తూ.గో: ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.జయ రామరాజుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో ఉమ్మడి తూ.గో. జిల్లాలో కానిస్టేబుల్‌గా రిక్రూట్ అయిన ఆయన, గత 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. గత మూడేళ్లుగా ధవలేశ్వరంలో హెడ్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఆయనను పలువురు అభినందించారు.