TG: 16 రోజలు జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ మేరకు ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.