మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా.. ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా AR రెహమాన్ పేరు వినిపించగా.. చివరికి తమన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.