టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం జూన్ 2026లో ముగియనుంది. దీంతో అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే, హర్భజన్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు 2024 T20 WC, 2025 CT గెలుచుకుంది. అలాగే, 2023 ODI WCలో ఫైనల్‌కు చేరింది.