కృష్ణా: గుడివాడ బొమ్మరిల్లు థియేటర్ ఎదురుగా ఉన్న రేణుకా హాస్పటల్ రోడ్డులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై ఈరోజు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ. 9,360ల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.