సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పేర్కొన్నారు. గురువారం దుబ్బాక మండలం దుంపలపల్లిలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా 12 ఎకరాల్లో సాగును ఆమె ప్రారంభించారు. ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.