SDPT: హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పప్పెట్రీ షోలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ప్రదర్శించిన బొమ్మలాట అందరినీ ఆకట్టుకుని రాష్ట్రస్థాయి కన్సోలేషన్ బహుమతిని దక్కించుకుంది. జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రమేశ్ ఆమెను అభినందించారు.