GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. 189.9 కి.మీ మేర నిర్మించే ఈ రోడ్డు డీపీఆర్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం జిల్లా వారీగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కేంద్రానికి అప్పగించారు. మిగిలిన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయనున్నారు. ప్రాథమిక సర్వేలు కొనసాగుతున్నాయి.