SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ‘అస్మిత’ అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళా ఈ వెబ్సైట్ nsrs.kheloindia.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.