SSC Studentపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ అంటే..?
పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ విద్యార్థి చనిపోయాడు.
SSC Student: ఏం జరిగిందో తెలియదు.. గొడవకు గల కారణం తెలియదు.. పదో తరగతి విద్యార్థిపై (SSC Student) పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు. తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి చనిపోయాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జిల్లాలో జరిగింది.
చెరుకుపల్లి మండలం రాజోలు (Rajole) పంచాయతీ పరిధిలో గల ఉప్పలవారిపాలెనికి చెందిన ఉప్పల అమర్ నాథ్ (amarnath) స్థానిక స్కూల్లో పదో తరగతి (SSC Student) చదువుతున్నాడు. ఉదయం రాజోలుకు ట్యూషన్‌కు వెళ్లి వస్తోండగా అతని స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి (venkateshwar reddy) అడ్డుపడ్డాడు. మరికొందరితో కలిసి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటలు అంటుకొని బాలుడు కేకలు వేశారు. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి గుంటూరు జీజీహెచ్‌కు (guntur GGH) తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. వెంకటేశ్వర్ రెడ్డి (venkateshwar reddy), మరికొందరు పెట్రోల్ పోసి నిప్పు అంటించారని అమర్ నాథ్ (amarnath) వాంగ్మూలం ఇచ్చారు. ఘటనపై చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ విద్యార్థిపై (Student) పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం కలకలం రేపింది. వారి మధ్య ఏం శత్రుత్వం ఉంది. చదువులో పోటీ ఉందా..? లేదంటే గర్ల్ ఫ్రెండ్ విషయంలో గొడవలు జరిగాయా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.