»Bapatla A Bus Overturned While Going To Take Care Of A Tree 40 People Were Seriously Injured
Bapatla: మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా బస్సు బోల్తా.. 40 మందికి తీవ్ర గాయాలు
పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. ఈ సంఘటన అద్దంకి మండలంలో జరిగింది. పల్నాడు జిల్లా కోటప్పకొండకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
Bapatla: ఈమధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. ఈ సంఘటన అద్దంకి మండలంలో జరిగింది. పల్నాడు జిల్లా కోటప్పకొండకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో వెళ్తున్నారు.
బస్సు కట్టర్ విరిగిపోవడంతో తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వాళ్లను 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితులను ఒంగోలు తరలించేందుకు అద్దంకి సీఐ సి.కృష్ణయ్య, ఎస్సై నాగరాజు, పోలీసులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.