జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎల్ఓసీలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులపై ఆమ్రీ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.