»Triangle Love Story In Chennai Young Woman Burnt Alive
Triangle love story యువతి సజీవదహనం
తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిని సజీవదహనం చేశాడు ఓ ట్రాన్స్‌జెండర్. తాను ట్రాన్స్‌జెండర్ అని తెలిసి వేరే అతనితో రిలేషన్లో ఉంది. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ కూడా యువతి ప్రేమించిన అతనిపై మనసుపడ్డాడు. విషయం తెలియడంతో దారుణం యువతిని చంపేశాడు.
Triangle love story in Chennai.. Young woman burnt alive
Triangle love story: నిజజీవితంలో కొన్ని క్రైమ్స్(Crime) చూసినప్పుడు సినిమాలు ఎందుకు పనిచేయవు అనిపిస్తాయి. అలాంటి ట్విస్టులు రచయితలు కూడా రాయలేరేమో అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన ఒకటి చెన్నై(Chennai) సిరుసేరి సమీపంలో చోటుచేసుకుంది. తాళంపూర్ పోలీసుల కథనం ప్రకారం.. పొన్మార్ ప్రాంతంలో కాలిన యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ ఆ యువతి కాళ్లు, చేతులు కట్టేసి సజీవదహనం చేసినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
మృతురాలు పేరు నందిని(25) చెన్నై పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. తాను కొన్నాళ్ల క్రితం వెట్రి మణిమారన్ అనే వ్యక్తిని ప్రేమించింది. తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయంతో తెలియడంతో తనను దూరం పెట్టింది. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇలా కొన్నాళ్లు సాగింది. తన మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్ కూడా రాహుల్‌ను ఇష్టపడుతున్నట్లు నందిని తెలుసుకుంది. దాంతో రాహుల్ తాను ప్రేమించుకుంటున్నట్లు ఇలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. మణిమారన్ వినలేదు. దాంతో మరోసారి ఇలా చేస్తే నీ గురించి అందరికి చెప్పేస్తా అని బెదిరించింది. నందినిపై కోపం పెంచుకున్న మాజీ ప్రియుడు. శనివారం నందిని పుట్టినరోజు కావడంతో ఆమెను చెరువుగట్టుకు తీసుకువెళ్లి కాళ్లు, చేతులు గొలుసుతో కట్టేసి పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. ప్రస్తుతం మణిమారన్ పరారీలో ఉన్నట్లు త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.