అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్లపాటు తట్టుకుని నిలబడేలా డిజైన్ చేశారు.
Ayodhya Ram Mandir: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్లపాటు తట్టుకుని నిలబడేలా డిజైన్ చేశారు. ఎలాంటి తుపానులు వచ్చినా 2500 ఏళ్లపాటు తట్టుకుని ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా తెలిపారు.
దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో, గర్భ గుడి అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారట. అలాగే ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందని తెలిపారు. భక్తులకు వివిధ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రిసెర్చ్ సెంటర్, ప్రార్థన మందిరం వంటి ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా నేపాల్ ప్రత్యేకంగా కొన్ని కానుకలను పంపనున్నది. ఇందులో వివిధ రకాల నగలు, సామగ్రి, బట్టలు, మిఠాయిలు ఉంటాయట. వీటిని అందజేయడం కోసం జనక్పూర్ధామ్-అయోధ్యధామ్ ప్రయాణం జనవరి 18న ప్రారంభమవుతుందని, 20 నాటికి అయోధ్య చేరుకుంటుందని జానకి ఆలయ మహంత రామ్రోషణ్ దాస్ వైష్ణవ్ తెలిపారు. అదే రోజున కానుకలను రామ మందిర ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు. గతంలో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు నేపాల్ కాళిగండకి నదీ తీరంలో సేకరించిన శాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపింది.