»Bandi Sanjay Complaint To Police For Missing Mobile
Bandi sanjay రివర్స్ గేర్.. ఫోన్ పోయిందని పోలీసులకు కంప్లైంట్
ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్లో కంప్లైంట్ చేశారు.
Bandi sanjay complaint to police for missing mobile
Bandi sanjay:ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ (mobile) పోయిందని.. వెతికి పెట్టాలని కోరారు. ఈ ఫోన్‌కే నిందితుడు ప్రశాంత్ (prashanth) పదో తరగతి హిందీ పేపర్ పంపించాడు. విచారణలో ఆధారం కానుండగా.. అరెస్టైన (arrest) రోజు నుంచి ఫోన్ కనిపించడం లేదు. మొబైల్ (mobile) గురించి బండి సంజయ్, ఆయన భార్య అపర్ణ (aparna) కూడా పోయిందని చెబుతున్నారు. పోలీసులు మాత్రం వారి వద్దే ఉందని అంటున్నారు.
అభివృధ్ది పనుల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీని (modi) బండి సంజయ్ (Bandi sanjay) నిన్న కలిశారు. ఇప్పుడు తన మొబైల్ (mobile) పోయిందని.. ఆన్ లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అరెస్ట్ చేసే సమయంలోనే పడిపోయిందని.. అందులో కీలక వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. బండి సంజయ్ (Bandi sanjay) వద్దే మొబైల్ ఉందని పోలీసులు (police) చెబుతుండగా.. పడిపోయిందని ఆయన (Bandi sanjay) అంటున్నారు. ఫోన్ దొరికితే గానీ.. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ విషయంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. షరతులతో కూడిన బెయిల్ మీద సంజయ్ బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇటు బీజేపీ ముఖ్య నేత ఈటల రాజేందర్‌కు (etala rajender) కూడా ప్రశాంత్ (prashanth) హిందీ పేపర్ వాట్సాప్ చేశాడట. దీంతో వరంగల్ డీసీపీ (warangal dcp) నోటీసులు ఇచ్చి.. శుక్రవారం విచారణకు రావాలని కోరారు. సోమవారం తనకు వీలు అవుతుందని ఈటల రాజేందర్ (etala rajender) లేఖ రాశారు. అంతకుముందు తాను టెక్నాలజీకి తాను అప్డేట్ కాలేదని ఈటల రాజేందర్ (etala rajender) తెలిపారు. మెసేజ్‌లు చూడనని.. రిప్లై కూడా ఇవ్వనని చెప్పారు. ఎవోర తనకు పేపర్ వాట్సాప్ చేస్తే.. దానిని తాను చూడకపోయినా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.