పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన పూర్తవుతాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించింది పదో తరగతి బోర్డు. పూర్తి సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ.
పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన పూర్తవుతాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించింది పదో తరగతి బోర్డు. పూర్తి సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ. మల్టీచాయిస్ ప్రశ్నా పత్రాన్ని ఆఖరి పదిహేను నిమిషాల్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. జనరల్ సైన్స్ పరీక్షలోని రెండు ప్రశ్నాపత్రాలను ఒకేసారి కాకుండా నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు విడవిడిగా ఇవ్వనుంది.
జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి ఫిజికల్, రెండోది బయాలాజికల్ సైన్స్. జనరల్ సైన్స్ లో తొలుత ఒక పేపర్ ను ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇస్తారు. ఇరవై నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్ ఇస్తారు. రెండో పేపర్ రాసేందుకు మరో గంటన్నర సమయం ఇస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నా పత్రాన్ని మాత్రం చివరి పదిహేను నిమిషాల ముందు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఆ సమయంలోనే పది ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది.
మరోవైపు, పరీక్షా కేంద్రాలకు అదనంగా ప్రశ్నా పత్రాలను పంపించరు. గత ఏడాది పరీక్షా కేంద్రాలకు విద్యార్థుల సంఖ్యకు అదనంగా పది నుండి 40 పంపించేవారు. గత ఏడాది లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఎంతమంది ఉంటే అన్ని మాత్రమే పంపించనున్నారు.