కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 436 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 10,742 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 10,305 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన వెల్లడించారు.