ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్(Cancer) బారినపడి ప్రాణాలను కోల్పోతున్నారు. కొంత మంది మందులు(Medicines) వాడుతూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఆహారం(Natural Food) తీసుకుంటే అందులోని గుణాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. చాలా మంది సరైన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి వ్యాధులతో పోరాడాల్సి వస్తోంది. ఈ తరుణంలో క్యాన్సర్(Cancer) రాకుండా కాపాడే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టొమాటోలు(Tomatos) క్యాన్సర్(Cancer) రాకుండా మనల్ని కాపాడుతాయి. ఇందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బాడీలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. నోటి క్యాన్సర్ కణాలను టొమాటో అద్భుతంగా నాశనం చేస్తుందని ఇజ్రాయెల్ పరిశోధకులు నివేదిక కూడా విడుదల చేశారు. ఉడికించిన టొమాటో(Boiled Tomato)ల్లో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కణాలు దెబ్బతినకుండా, క్యాన్సర్(Cancer) రాకుండా నిరోధిస్తుంది. టొమాటోలు బాగా తినేవారిలో రొమ్ము, ప్రొస్టేట్, క్లోమ, మలద్వార క్యాన్సర్లు వచ్చే ప్రమాద శాతం తక్కువగా ఉంటుంది.
గింజ(Nuts)ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్(Cancer) వ్యాప్తిచెందకుండా కాపాడుతాయి. నట్స్ ప్రొస్టేట్ క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే నట్స్ కొందరికి అలర్జీని కలిగిస్తాయని, అందుకే అటువంటివారు వాటిని తీసుకోవద్దని కోరుతున్నారు. వాల్ నట్స్, అవిసెగింజల్లో ఒమేగా ప్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను అడ్డుకుంటాయి. అవిసెగింజలు తింటే పేగు, మలద్వార క్యాన్సర్లు(Cancers) వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
వెల్లుల్లి(Garlic)లో క్యాన్సర్ (Cancer)తో పోరాడే రోగనిరోధక పోషకాలు(Immunity) ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి క్యాన్సర్ కంతుల పెరుగుదల వేగాన్ని అడ్డుకుంటుంది. వెల్లుల్లిని తరచూ తీసుకునేవారిలో క్యాన్సర్ కారక కణాలు పెరగవు. వెల్లుల్లి(Garlic)లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల అది పొట్ట, పేగు క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది.
పసుపు(Turmeric)ను రోజూ ఆహారం(Food)లో భాగం చేసుకుంటే పేగు క్యాన్సర్(Cancer) అస్సలు మన దరి చేరదు. పసుపు పేగు, రొమ్ము క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. ఆకుకూరలు మన శరీరానికి అన్ని విధాలుగా మంచి చేస్తాయి. పాలకూర, కేల్, వాటర్ క్రెస్ వంటి ఆకుకూరల్లో క్యాన్సర్ ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ శాతం ఉంటాయి. బొప్పాయి(Papaya)లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫొలాసిన్ క్యాన్సర్లను రాకుండా నిరోధిస్తుంది. పుట్టగొడుగు (Mushrooms)ల్లో మంచి పోషక విలువలు ఉన్నాయి. ఇందులోని లెంటినాన్ రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతుంది. పుట్టగొడుగులు(Mushrooms) లెక్టిన్ క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా అడ్డగిస్తాయి. శరీరానికి రోగనిరోధక శక్తి (Immunity)ని అందిస్తాయి.